కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 8వ తేదీ (మంగళవారం) సాయంత్రం 4:40 గంటలకు అమిత్ షా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో ముచ్చింతల్ చేరుకుంటారు. రామానుజాచార్యుల విగ్రహ దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన 108 దివ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. అనంతరం యాగశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజాల్లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి అమిత్ షా తిరిగి వెళ్లనున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ముచ్చింతల్, శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.













