మరో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తక్షణమే ఆ ప్రాంతాలన్నీ
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసే పనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉండే స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియాలను మే 15 వరకు మూసివేస్తున్నట్టు కేంద్రంలోని సీనియర్ అధికారులు ప్రకటించారు. గతేడాది కరోనా విశ్వరూపం చూపిన సందర్భంలో కూడా ఈ క్టడాలన్నీ మూసివేయగా, కొన్ని రోజుల తరువాత వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలు ఎత్తివేసిన విషయం తెలిసిందే.













