హిమాన్షు ఎంతోమంది యువతకు ఆదర్శం : మహేష్ బిగాల
హైదరాబాద్ శివారులోని కేశవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ స్కూల్‌కు ధీటుగా తీర్చిదిద్దిన హిమాన్షు ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచారని బీఆర్ఎస్, ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొనన్నారు. మనసుండాలే కానీ వయసుతో పనేముందని హిమాన్షు నిరూపించారన్నారు. మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్‌గా ఎన్నో అభివృద్ధి పనులతో ముందుకు దూసుకెళ్తున్నారన్నారు. తన తాత ఆశీస్సులతో, తండ్రి అడుగు జాడల్లో హిమాన్షు ముందుకు నడుస్తూ తాను చదువుకుంటున్న ఖాజాగూడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలోని కేశవనగర్ ప్రభుత్వ బడిని కార్పొరేట్ స్కూల్‌ను తలదన్నేలా తీర్చిదిద్దారని మహేశ్ బిగాల కితాబునిచ్చారు.













