తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. శాసన సభ్యత్వ రద్దుపై కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయలేదని న్యాయస్థానం మండిపడింది. వారం రోజుల్లో సృష్టత ఇవ్వకపోతే అసెంబ్లీ కార్యదర్శి తమ ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు సీరియస్ అయింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావుపై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీరు ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నారా? పార్టీ న్యాయవాదిగా ఉన్నారా అని ప్రశ్నించింది. వారం రోజుల్లో సృష్టత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచరణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.













