పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట
పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నగర బహిష్కరణను ఎత్తివేస్తూ హైకోర్టు మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది. పరిపూర్ణానంద రెచ్చగొట్టే వాఖ్యలు చేశారంటూ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధి నుంచి ఆయనను బహిష్కరిస్తూ ఆయా కమిషనర్లు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. శ్రీరాముడిపై కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీసులు నగర బహిష్కరణ విధించారు. అనంతరం నెల రోజుల క్రితం పరిపూర్ణానంద స్వామీజీపై కూడా బహిష్కరణ వేటు వేశారు. అయితే తనపై బహిష్కరణను ఎత్తివేయాలంటూ పరిపూర్ణానంద, హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యలో పరిపూర్ణానంద వినతిని పరిశీలిచిన హైకోర్టు, ఆయనపై బహిష్కరణను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.













