వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై షర్మిల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ విమర్శలే తప్ప వ్యక్తిగతంగా విమర్శించవద్దని హైకోర్టు సూచించింది. అలాగే గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలవుతాయని ధర్మాసనం పేర్కొంది. షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని వరంగల్ సీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం నిరసనగా షర్మిల అమరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లాలో షర్మిల పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు అనుమతి రద్దు చేసిన విషయం తెలిసిందే.













