పంచాయతీ ఎన్నికలను ఆపలేం
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్, దాని ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. పిటిషనర్లు, ప్రభుత్వ వర్గాల వాదనలు విన్న హైకోర్టు ప్రస్తుత దశలో పంచాయతీ ఎన్నికలకు ఆపలేమని సృష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారి చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.













