కొత్త సచివాలయ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం నిర్మాణానికి అడ్డంకులు తొలగినట్లే కనిపిస్తోంది. సికింద్రాబాద్‌లోని బైసన్‌పోలో, జింఖానా మైదానాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆ ప్రాంతంలో చేపట్టిన నిర్మాణపు పనులు కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. మరో వైపు ఆ రెండు మైదానాలను తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించేందుకు ఆమోద ముద్ర వేసినట్లు కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. సదరు మైదానాల కేటాయింపు పై దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని హైకోర్టు పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్.రాధాక ష?న్, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందఠంగా సహాయ సోలిటర్ జనరల్(ఏఎస్జీ) వాదనలు వినిపిస్తూ%ౌౌ% సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో, జింఖానా మైదానాలను తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు విన్నవించారు.
తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచందర్ రావు వాదనలు వినిపిస్తూ.. బైసన్ పోలో మైదానాన్ని సచివాలయ నిర్మాణం కోసం కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలు విచారణలో ఉన్న కారణంగా ఆ స్థలాన్నికేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని తెలిపారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అభ్యర్థించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో సైనిక బలగాల ఆదీనంలో ఉన్న బైసన్ పోలో, జింకానా మైదానాలను తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణం కోసం ప్రభుత్వానికి అప్పగించరాదంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.













