వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి
వైఎస్ఆర్ టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. వైఎస్ఆర్ టీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. అయితే సీఎం కేసీఆర్, రాజకీయ, మతపరమైన అంశాలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు తెలిపింది. వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర వరంగల్ జిల్లాలో ఉద్రికత్తకు దారి తీయడంతో పోలీసులు అనమతి రద్దు చేశారు. పాదయాత్ర చేసేందుకు ప్రయత్నించిన ఆమెను అడ్డుకున్న నర్సంపేట పోలీసులు హైదరాబాద్ తరలించారు. షర్మిల పాదయాత్రకు నర్సంపేట పోలీసులు అనుమతి రద్దు చేశారని, పాదయాత్రకు అనమతివ్వాలని వైటీపీ సభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం స్పష్టించారని పిటిషన్లో పేర్కొన్నారు.













