బండి సంజయ్ పాదయాత్రకు… హైకోర్టు గ్రీన్ సిగ్నల్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జనగామా జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర నిలిపివేయాలంటూ వర్ధన్నపేట ఏసీపీ ఇచ్చిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. పోలీసులు ఇచ్చిన నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో బండి సంజయ్ పాదయాత్రకు మార్గం సుగమమైంది. బండి సంజయ్ పాదయాత్ర రేపు తిరిగి ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం రోజు యాత్ర ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. ఈ నెల 27న మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగియనుంది.













