ఆ ఎమ్మెల్యేలకు షాకిచ్చిన హైకోర్టు
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే తెలంగాణలో ప్రతిపక్షం అనేది ఉండదేమో. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్మేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన నేతలు ఓ వైపు ధర్మాలు, మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నేడు ఈ వ్యవహారంపై విచారించిన .. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోచారంతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్మేలు, నలుగురు ఎమ్మెల్సీలకు, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
సుధీర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్‌రెడ్డి, కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్దన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, సురేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా ఈ నాలుగు రోజుల్లో నోటీసులు అందుకున్న స్పీకర్, నేతలు హైకోర్టు వివరణ ఇవ్వాల్సి ఉంది.













