తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. 2018 ఎన్నికల అఫిడవిట్లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అప్పటి ప్రత్యర్థి జలగం వెంకట్రావు పిటిసన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. ప్రస్తుత ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది. 2018లో జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున వనమా వెంకటేశ్వరావు, టీఆర్ఎస్ ప్రస్తుతం తరపున జలగం వెంకట్రావు ఎమ్మెల్యే అభ్యర్థులగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వనమా విజయం సాదించారు. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ 2019లో జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ పిటిషన్ దాఖలు చేశారు. వనమాను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. సుదీర్ఘ విచారణ అనంతరం జలగం వెంకట్రావు వాదనలతో ఏకీభివించిన ఉన్నత న్యాయస్థానం వనమా ఎన్నిక చెల్లదంటూ నేడు తీర్పు వెలువరించింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనకు రూ.5 లక్షల జరిమానాను విధించింది.













