హైటెక్ సిటీ సిల్వర్ జూబ్లీ వేడుకలు.. చంద్రబాబు వల్లే
హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో నిర్మించిన హైటెక్ సిటీ ప్రపంచంలో తెలంగాణ ప్రతిష్టను ఇనుమడిరప చేస్తోందని ఈ ఉత్సవాల్లో నందమూరి కుటుంబ సభ్యుడు రామ కృష్ణ గుర్తు చేశారు. తెలుగుజాతి అభివృద్ధికి నిరంతరం కృషి చేసి, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు శ్రమించిన చంద్రబాబుకు మద్దతుగా గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబుకు కృతజ్ఞత సభను నిర్వహించారు. హైటెక్ సిటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని సీబీఎన్ గ్రాటిడ్యూట్ కాన్సెర్ట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ టెక్నాలజీని అభివృద్ధి చేసి చంద్రబాబు రాష్ట్రానికి అంతర్జాతీయ కీర్తి తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ అభివృద్ధి, హైటెక్ సిటీ స్థాపన, శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటు, అభివృద్ధిపై చంద్రబాబు చేసిన కృషిని వీడియోలో ప్రదర్శించారు. అనంతరం అనూప్ రూబెన్స్ టీమ్ ఆధ్వర్యంలో సంగీత విభావరి ఏర్పాటు చేశారు.













