హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కట్టడి విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకొనే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ టెస్ట్ చేస్తామన్నారు. కేంద్రం బూస్టర్ డోస్, చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌పై స్పందించడం లేదన్నారు. ఇతర దేశాలు బూస్టర్ డోస్ ఇవ్వాలని చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని తెలిపారు. ఇంకా కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని, వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నెల చివరిలో ఢిల్లీలో ఆర్థిక శాఖ మంత్రులతో కేంద్రం నిర్వహించనున్న సమావేశనికి వెళ్లే అవకాశం ఉందన్నారు. అక్కడ మరో మారు కేంద్రంతో వ్యాక్సినేషన్, కొవిడ్ కట్టడి పైన కేంద్రంతో మాట్లాడుతామని స్పష్టం చేశారు.













