కరోనా చికిత్సలపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ చికిత్సలపై కీలక నిర్ణయం తీసుకొంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కరోనా చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్, కర్ఫ్యూ పెట్టే పరిస్థితి లేదన్నారు. సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. కరోనా ట్రీట్మెంట్ కోసం మెడికల్ కాలేజీల్లో సాధారణ బెడ్స్‌తోపాటు ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లు సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కొత్తగా నాలుగు కోవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటికి రూ.1.79 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బేగంపేటలోని ప్రకృతి చికిత్సాలయం, ఎర్రగడ్డ అయుర్వేద కాలేజీ, నిజామియా టీబీ ఆస్పత్రి, సరోజీనీదేవి ఆస్పత్రిలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మహారాష్ట్రలో ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయని అన్నారు. తెలంగాణకు మహారాష్ట్ర నుంచి వచ్చిపోయేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. మహారాష్ట్ర ఎఫెక్ట్ తెలంగాణపై ఉంటుదని అన్నారు.













