డిసెంబర్ వరకు ఇలాగే.. అయితే ఆందోళన అక్కర్లేదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా, ఆందోళన అవసరం లేదని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కేసులు పెరుగుదల ఆందోళన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ తరపున ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నా అస్పత్రుల్లో చేరికలు లేవని, మరణాల సంఖ్య కూడా సున్నాగా ఉందని అన్నారు. కరోనా మొత్తం ఎలిమినేట్ కాలేదు. సబ్ వేరియంట్స్ కొంత ఇబ్బంది పెడుతున్నాయి. వచ్చే డిసెంబర్ వరకు ఇలాగే ఉండే అవకాశం ఉంది. అయితే ఆందోళన అక్కర్లేదు. మాస్క్ ధరించాలి. జాగ్రత్తలు పాటించాలి. జ్వరం, తలనొన్పి, వాసన లేకపోతే కచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. జాగ్రత్తలు పాటించడం మరి మంచిదన్నారు. త్వరలో ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేన్ చేపట్టబోతున్నాం. 12`18 ఏళ్ల వారికి వ్యాక్సినేసన్ అందుబాటులోనే ఉందని అన్నారు.













