చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ ఇక లేరు
ఆస్తమా, ఉబ్బసం బాధితులకు చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాత్ గౌడ్ కన్నుమూశారు. బత్తిని సోదరుల్లో ఒకరైన 84 ఏండ్ల హరినాథ్ గౌడ్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది చేప ప్రసాదం. ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చేప ప్రసాదం కోసం తెలంగాణ నలు మూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఆస్తమా బాధులు రెండు రోజుల ముందుగానే నగరానికి వస్తుంటారు.













