కోమటిరెడ్డి, సంపత్ కు హైకోర్టులో చుక్కెదురు
కోమటిరెడ్డి, సంపత్ కుమార్ల అసెంబ్లీ సభ్యత్వం రద్దు వ్యవహారం మళ్లీ మలుపు తిరిగింది. ఇద్దరు కాంగ్రెస్ నేతలను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలన్న సింగిల్ జడ్డి ఆదేశాలను ధర్మసనం రెండు నెలల పాటు నిలిపివేసింది. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యంతో పాటు, స్పీకర్‌కు జారీ చేసిన నోటీసుల అమలును కూడా నిలిపివేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పై పూర్తి స్థాయి విచారణ కోసం నాలుగు వారాలకు వాయిదా వేసింది.













