ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకోర్టులో ఊరట
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు హైకోర్టులో ఊరట లభించింది. ఏడాది జైలు శిక్ష విధిస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులతో దురుసుగా వ్యవహరించారనే అభియోగంపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ రాజాసింగ్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు స్టే మంజూరు చేస్తూ విచారణ నాలుగువారాలకు వాయిదా వేసింది.













