బీజేపీ సభకు హైకోర్టు అనుమతి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో నిర్వహించనున్న సభకు హైకోర్టు అనుమతిచ్చింది. 27వ తేదీ సాయంత్రం హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సభకు పోలీసుల నుంచి అనుమతి లేదని, అందువల్ల అనుమతి రద్దు చేస్తున్నట్లు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. దీంతో బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం షభకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సభలో నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరని హామీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.













