కోమటిరెడ్డి, సంపత్ కు హైకోర్టులో ఊరట
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ల సభ్యుత్వ రద్దుపై గతంలో సంగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సమర్దిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను కొట్టివేసింది.
అసెంబ్లీ సమావేశాల్లో హెడ్‌ఫోన్స్ విసిరి దాడి చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేసిన విషయం తెలిసింది. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టు ఆశ్రయించిగా ఇరువురి శాసనసభ సభ్యత్వాల రద్దు చెల్లదని తీర్పునిచ్చింది. కోమటిరెడ్డి, సంపత్‌పై అసెంబ్లీ బహిష్కరణను ఎత్తివేసిన కోర్టు, వారిద్దరిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే.













