దేశం కోసం.. ధర్మం కోసం వెంటనే భర్తీ చేయాలి
కేంద్రంలో ఖాళీగా ఉన్న ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి ఐదింటిలో ఒకటి ఖాళీగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 8,72,243 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ 2021 జులైలో రాజ్యసభలో ప్రకటించారు. ఈ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదు? అని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. దేశం కోసం, ధర్మ కోసం ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మొత్తం 40 లక్షల 4వేల 941 ఉద్యోగాలకు గానూ.. మార్చి 1, 2020 నాటికి 31 లక్షల 32 వేల 698 మంది మాత్రమే పని చేస్తున్నారు. 8 లక్షల 72 వేల 243 ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా రాజ్యభలో వెల్లడించారు.













