కేంద్రమే రాష్ట్రానికి సహకరించట్లేదు : మంత్రి హరీశ్‌రావు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం వచ్చినట్లు లేదని, తెలంగాణపై విషం కక్కేందుకే వచ్చినట్లు ఉందన్నారు. ప్రధానిగా ఇన్ని అబ్దాలు చెప్పడం మోదీకే చెల్లిందని విమర్శించారు. రైతుబంధువును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యింది. పీఎం కిసాన్తోనే మొదటిసారి రైతులకి లబ్ధి అని చెప్పడం సిగ్గుచేటు. తన వల్లే డీబీటీ మొదలైనట్లు చెప్పడం పచ్చి అబద్ధం అన్నారు. ఐటీఐఆర్‌ను బెంగళూరుకు తరలించారు. రాష్ట్రంలో ధాన్యం కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరించలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నిజానికి కేంద్రమే రాష్ట్రానికి సహకరించట్లేదు అని అన్నారు.













