తెలంగాణ ప్రభుత్వం మరో కీలక మైలురాయి
ఎంబీబీఎస్ సీట్ల పెంపులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక మైలురాయిని అందుకుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో 43 శాతం తెలంగాణకు చెందినవే అని హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ విభాగంలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 2,188 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. వాటిలో 900 సీట్లు తెలంగాణకు చెందిన వైద్య కళాశాలలకు చెందినవే. ఆరోగ్య తెలంగాణ లక్ష్యం దిశగా సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి ఇది నిదర్శనం. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మిగతా వైద్య కళాశాలలకూ అనుమతులు వస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.













