Harish Rao: పేద విద్యార్థిని కోసం ఇంటిని తాకట్టుపెట్టిన హరీశ్ రావు!
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తన పెద్ద మనసును చాటుకున్నారు. పీజీ (PG) వైద్యవిద్య చదువుతున్న ఓ పేద విద్యార్థినికి రుణం కోసం తన ఇంటిని తనఖా పెట్టారు. విద్యార్థిని మమత (Mamata) చదువు కోసం ఏటా రూ.7.50 లక్షలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఏదైనా ఆస్తి తనఖా పెడితేనే రుణం ఇస్తామని బ్యాంకర్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని హరీశ్‌రావు దృష్టికి మమత, ఆమె తండ్రి రామచంద్రం (Ramachandram) తీసుకెళ్లారు. దీంతో ఆయన సిద్ధిపేట (Siddipet)లోని తన ఇంటిని తనఖా పెట్టి రూ.20 లక్షల విద్యారుణం ఇప్పించారు. విద్యార్థిని హాస్టల్ ఫీజు కోసం రూ.లక్ష నగదు అందజేశారు.






