త్వరలో ఆదిలాబాద్ లోనూ అలాంటి సేవలు : హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి జ్వరం సర్వే నిర్వహిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కేథ్ ల్యాబ్ సహా మరికొన్ని సేవలను మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరిన్ని వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్పొరేటట్ ఆస్పత్రులకే పరిమితమైన గుండె సంబంధిత చికిత్సలని పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు ఇప్పటికే గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రుల్లో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆదిలాబాద్‌లోనూ అలాంటి సేవలను అందుబాటులోకి తెస్తామని అన్నారు. బూస్టర్ డోసుల కాలపరిమితిని తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యసేవలు అందేలా ఖమ్మంలో 100 పడకల ట్రామాకేర్ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో తొలి మిల్క్ బ్యాంక్ నీలోఫర్ ఆస్పత్రిలో ఉంటే, రెండో మిల్క్ బ్యాంక్ ఖమ్యంంలో ప్రారంభించాం. ఖమ్మం ఆస్పత్రిలో త్వరలోనే కీమో థెరపీ, రేడియో థెరపీ సేవలను ప్రారంభిస్తాం అని తెలిపారు.













