దేశంలోనే అత్యధికంగా.. తెలంగాణలోనే ఇస్తున్నాం
దేశంలోనే ఆశా వర్కర్లకు అత్యధిక వేతనం తెలంగాణలోనే ఇస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కొత్తగా రిక్రూట్ అయిన 1500 మందికి పైగా ఆశ వర్కర్లకు శిల్పకళా వేదికగా మంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం న్యూట్రిషన్ పాలిటిక్స్ చేస్తే, విపక్షాలు పార్టిషన్ పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శించారు. కులమతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వేతనం పెంచాలని కోరిన ఆశా వర్కర్లను గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్‌ది అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం నరం లేని నాలుక అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో సైతం ఆశాలకు వేతనాలు అంతంతమాత్రమే. ఈ నెల నుంచి ఆశాలకు ఇచ్చే స్మార్ట్ ఫోన్ బిల్లులను సైతం ప్రభుత్వమే చెల్లిస్తుంది. పేదల సంక్షేమమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని. వైద్య సిబ్బంది దేవతల్లా కనిపిస్తారు. ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రజల్లో భరోసా పెరిగింది. దాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు.













