హాలియా యువకుడికి అరుదైన గౌరవం
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా హాలియా పట్టణానికి చెందిన యువకుడు నేడున్ఘాట్ విష్ణుకు అరుదైన గౌరవం లభించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో ప్రతిభ చాటారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటా జాతీయ స్థాయికి ఎంపికైన ఆయనకు రాష్ట్ర నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ కో ఆర్డినేటన్ ప్రసాద్‌దాస్ హైదరాబాద్‌లో ధ్రువపత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా జరిగిన పోటీల్లో ప్రతిభ చూపిన వారికి పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం కల్పించనున్నారు.
ఈ నెల 31న సర్దార్ వల్లభ్యాయ్ పటేల్ జయంతి సందర్భంగా పార్లమెంట్లో ఉపన్యాస పోటీలు నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 8 మందిని ఎంపిక చేయగా అందులో తెలంగాణ నుంచి విష్ణు ఎంపికయ్యారు. విష్ణు ప్రస్తుతం నల్గొండలో డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నారు.













