వేలానికి బ్రహ్మ వజ్రకమలం
వజ్రాలు పొదిగి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న బ్రహ్మ వజ్రకమలం ఉంగరాన్ని ఈ నెల 13 నుంచి 22 వరకు ఆన్లైన్ వేలం వేయనున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లోని ది డైమండ్ స్టోర్ నిర్వాహకుడు, డిజైనర్ కొట్టి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ అరుదైన ఉంగరాన్ని సుమారు 11 నెలలపాటు శ్రమించి తయారు చేశారు. ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించే ఈ ఉంగరం రిజర్వ్ ధర రూ.78 లక్షలుగా నిర్ణయించామని, వచ్చిన డబ్బులో 10 శాతం పీఎం కేర్ ఫండ్స్‌కు విరాళంగా అందిస్తామని నిర్వాహకుడు కొట్టి శ్రీకాంత్ తెలిపారు.













