ఈ పథకం నిరంతరాయంగా అమలు.. ఆందోళన వద్దు
గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని దరఖాస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేపటితో తొలి విడత గడువు ముగియనున్న నేపథ్యంలో మంత్రి స్పందించారు. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని ఈ పథకాన్ని నిరంతరాయంగా అమలు చేస్తామన్నారు. గ్రామకంఠంలో ఉన్న పాత ఇళ్లు, స్థలాలకు దస్తావేజు పేపర్లు ఉండవని, ఇంటి నంబర్ లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. దరఖాస్తు గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తుదారులు తమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్కు దరఖాస్తులు పంపించవచ్చని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3000 ఇళ్లు పూర్తయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.













