విత్తన గణపతిని కొనుగోలు చేయండి
పర్యావరణ అవగాహన, పచ్చదనం పెంపులో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినాయక చవితిని పురస్కరించుకుని సీడ్ గణేశ్ ప్రతిమలను పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. హైదరాబాద్, పంజాగుట్ట సమీపంలో ఉన్న నెక్ట్ గలేరియా మాల్ లో సందర్శకులకు ఎంపి చేతలు మీదుగా విత్తణ గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి వెంకటేష్ నేత, గో రూరల్ సంస్థ సీఈవో సునీల్, టీ న్యూస్ సిజిఎం ఉపేందర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా పర్యావరణహితంగా గణేష్ ప్రతిమలను మట్టి, కొబ్బరి నాచు (కోకో పౌడర్) ను వాడుతూ ప్రతిమలను తయారు చేశారు. ఈ సారి గణేష్ ప్రతిమలతో పాటు వివిధ రకాల విత్తనాలను మట్టిలో పొందుపర్చారు. హరిత తెలంగాణ సాధనలో చింత, వేప చెట్లను విరివిగా పెంచాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆశయం మేరకు ఆ విత్తనాలతో కూడిన మట్టి గణేషులను తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లు ఎంపి సంతోష్‌కుమార్ వెల్లడించారు.













