గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం ముందుకు కొనసాగుతుంది. వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు దీనిలో భాగస్వాములు కావడానికి ముందుకు రావడం జరుగుతుంది ఈ ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ శరణీనారాయణ గారు ఈరోజు మాదాపూర్ లోని తన నివాసంలో తన కుమారుడు గంట జిష్ణుఆర్యన్ తో కలిసి మొక్కలు నాటి సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలియజేయడం జరిగింది. రోజురోజుకు మారిపోతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.













