గ్రీన్ ఛానల్.. హైదరాబాద్ పోలీసుల ఘనత
హైదరాబాద్ నగర పోలీసులు మరోసారి గ్రీన్ ఛానల్‌ను ఏర్పాటు చేసి వారి ఘనతను చాటుకున్నారు. గ్రీన్ ఛానల్లో భాగంగా అతి తక్కువ సమయంలో లైవ్ ఆర్గాన్స్ (గుండె, ఉపిరితిత్తులు)ను ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేటలోని కిమ్స్‌కు తరలించారు. మంగళవారం ఉదయం రాచకొండ ట్రాఫిక్ పోలీసులు లైవ్ ఆర్గాన్స్‌ను ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా 17.6 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేసి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఓ మనిషి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను పలువురు ప్రశంసించారు.













