గ్రేటర్ ఎన్నికల్లో కొత్త ఓటర్ల తీర్పే కీలకమా?
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని పార్టీలు కొత్త ఓటర్లపైనే ఫోకస్ పెట్టాయి. వారిని తమవైపు తిప్పుకునేలా ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మొత్తం150 డివిజన్లలో ప్రస్తుతం 74.04 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2016 బల్దియా ఎన్నికలప్పుడు ఈసంఖ్య 74.23లక్షలుగా ఉంది. అప్పటి కంటే ఈసారి 20వేలకుపైగా ఓటర్లు తగ్గారు. డివిజన్ల వారీగా చూస్తే కొన్నింట్లో మాత్రమే ఓటర్లు తగ్గినా, మెజార్టీ డివిజన్లలో సగటున1500కు పైగా కొత్త ఓటర్లు పెరిగారు. ఇక ఓటర్ ఎన్రోల్మెంట్ నుంచే అన్ని పార్టీలు కొత్త ఓట్లర్లపై ఫోకస్ చేశాయి. ఎన్నికల సందర్భంగా వారిని తమ వైపు తిప్పుకునేలా పక్కా ప్లాన్ తో వెళ్తున్నాయి. కాగా కొత్త ఓటర్లు ఎవరికి ఓటేస్తారోనన్నది ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది.













