మిస్ హైదరాబాద్ గా గౌరీప్రియ
మిస్ హైదరాబాద్-2018 గా గౌరీప్రియ ఎంపికయ్యారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన మిస్ హైదరాబాద్-2018 పోటీలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. అందాల కిరీటం కోసం ముద్దుగుమ్మలు పోటీపడుతూ, ర్యాంప్‌పై హోయలు పోయారు. అందం, అభినయం, ఆహార్యం, తెలివితేటలు కలబోతగా నిర్వహించిన పోటీలో కిరీటం కోసం 24 మంది అమ్మాయిలు పోటీపడ్డారు. విజేతగా గౌరీప్రియ ఎంపికవ్వగా, ఫస్ట్ రన్నరప్‌గా అషిమా గౌతం, సెకండ్ రన్నరప్‌గా రియా సింగ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో సాగిన అందాల పోటీల కోసం డిజైనర్లు రూపొందించిన వస్త్రాల్లో అందగత్తెలు మురిసిపోయారు.













