సీఎం కేసీఆర్ శుభవార్త.. కార్మికులకు మే డే కానుక
పారిశుధ్య కార్మికులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పారిశుధ్య కార్మికుల వేతనం రూ.వెయ్యి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే వేతనాల పెంపు అమలులోకి రానున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మందికి కార్మికులకు లబ్ది చేకూరనున్నది. జీహెచ్ఎంసీ, జలమండలి, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. ఇదిలా ఉండగా, ఆర్టీసీ కార్మికుల వేతనాలను సైతం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ ఆదేశించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పై పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.













