నుమాయిష్ ను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ 2022 ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ముఖ్య అతిథిగా హాజరై నుమాయిష్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ హైదరాబాద్ నుమాయిష్‌కు ఎంతో చరిత్ర ఉందన్నారు. టీకా కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. మాస్క్ పెట్టుకొని వారిని నుమాయిష్‌లోకి అనుమతించొద్దని నివ్వాహకులకు సూచించారు. అనంతరం హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది విద్యార్థులకు నుమాయిష్ అండగా ఉందని అన్నారు.
ఎగ్జిబిషన్ ఆదాయాన్ని 19 ఎడ్యుకేషనల్ సంస్థలకు ఉపయోగిస్తున్నారన్నారు. ఈ ఆదాయంతో 30 వేల మంది విద్యార్థులకు ఎడ్యుకేషన్ అందిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారన్నారు. నుమాయిష్‌లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారన్నారు. కరోనా నేపథ్యంలో మాస్క్ లేకుండా ఎవరూ కూడా ఎగ్జిబిషన్‌కు రాకూడదన్నారు. మాస్క్ లేకుంటే పోలీసులు ఫైన్ విధిస్తారని ఆయన హెచ్చరించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకొని వ్యాపారస్తులు ఇక్కడ తీసుకోవచ్చని ఆయన తెలిపారు.













