హైదరాబాద్-పుదుచ్చేరి మధ్య విమాన సర్వీసులు
హైదరాబాద్, పుదుచ్చేరిల మధ్య ప్రారంభమైన తొలి డైరెక్ట్ విమానంలో తెలంగాణ గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రయాణించారు. హైదరాబాద్, పుదుచ్చెరిల మధ్య విమాన సర్వీసులు ప్రారంభించే విషయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సమయంనం చేస్తూ, ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ విమాన సర్వీసులు ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విమాన సర్వీసులు ప్రారంభానికి సహకరించిన ప్రధాని మోదీకి, పౌర విమానయాన శాఖ మత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కృతజ్ఞతలు తెలిపారు. పుదుచ్చేరిలోని అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించటానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడతారని తెలిపారు. హైదరాబాద్ బిర్యానీ రుచి కోసం పుదుచ్చేరి ప్రజలు ఇక్కడ వస్తారని గవర్నర్ పేర్కొన్నారు. ఈ విమాన సర్వీస్ ప్రారంభం వల్ల ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలు మరింత మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.













