ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది : గవర్నర్ తమిళిసై
ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ రాజ్ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ తమిళసై ప్రసంగించారు. అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళులర్పిస్తున్నాని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఎదగడం సంతోషకరమని అన్నారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ఎదిగిందన్నారు. రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యాక్సినేషన్లో ప్రపంచంలోనే మనం ముందున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు.













