తెలంగాణ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మలమైన మనసుతో ముందుకు సాగుతానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్ భవన్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్భవన్లో ఉన్నా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నానని కొన్ని విషయాలు బయటకు చెప్పలేమని వ్యాఖ్యానించారు. ఈ మూడేళ్లలో మహిళా గవర్నర్ను వివక్షకు గురి చేశారన్నారు. ప్రజల దగ్గరికి వెళ్లాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది ఎదురైందని ఆమె ఆరోపించారు. గవర్నర్ కార్యాలయానికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడం లేదన్నారు. సమ్మక్క సారక్క పర్యటనలోనూ అవమానించారన్నారు. రిపబ్లిక్ డేకు జెండా ఎగరేసే అవకాశం కల్పించలేదు. పెద్ద ఆసుపత్రి డైరెక్టర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటే తెలంగాణలో అసుపత్రుల పరిస్థితి ఎలా ఎందో అర్థం చేసుకోవచ్చు అని గవర్నర్ వ్యాఖ్యానించారు.













