ఇది దేశం గర్వించదగిన అంశం : తమిళిసై
మొట్ట మొదటిసారిగా ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యారని, ఇది దేశం గర్వించదగిన అంశమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. ఢిల్లీ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు. ప్రొటోకాల్ నను పాటించడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రథమ పౌరురాలిగా బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లానన్నారు. ఈ దఫా పర్యటనలో కూడా అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని మండిపడ్డారు. ప్రగతి భవన్, రాజ్‌భవన్ గ్యాప్ తానిప్పుడేమీ వ్యాఖ్యానించనని అన్నారు. వరదలకు క్లౌడ్‌బస్టర్ కారణం అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తాను బరెస్ట్ కానని, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూనే ఉందన్నారు. వరదల వల్ల కలిగిన నష్టంపై కేంద్రానికి ఇప్పటికే నివేదిక పంపించానన్నారు. కాగా తెలంగాణ గవర్నర్ హోదాలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి తమిళిసై హాజరయ్యారు.













