బోనాల పండుగ వెనుక ఎంతో చరిత్ర : గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ తమిళి సై బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లోని అమ్మవారి గుడి ప్రాంగణంలో నిర్వహించిన బోనాల పండుగలో భాగంగా గవర్నర్ తమిళి సై స్వయంగా బోనమెత్తారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. బోనాల పండుగ వెనుక ఎంతో చరిత్ర ఉందని అన్నారు. అషాడ, శ్రావణ మాసాల్లో బోనాల పండుగను ఎంతో భక్తితో నిర్వహిస్తారన్నారు. ఆషాడ మాసంలో ఎక్కువగా నల్ల పోచమ్మను కొలుస్తారని అన్నారు. ఈ సంవత్సరం బోనాల పండగ నిర్వహించేందుకు ఒక ప్రత్యేకత ఉందని, అమ్మవారి దయవల్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ బుస్టార్ డోసు వేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుందని తెలిపారు. వరదలు సంభవిస్తున్న కారణంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని గవర్నర్ సూచించారు.













