అభివృద్ధికి మూలకారణం మైక్రోస్కోపే : తమిళిసై
దేశీయంగా మైక్రోస్కోప్‌ల తయారీ విస్తృతంగా పెరగాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్లో 12వ ఆసియా మైక్రోస్కోపిక్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశీయంగా మైక్రోస్కోప్‌ల తయారీ పెరగాలన్నారు. సునిషిత పరిశీలన, పరిశోధనలకు మైక్రోస్కోప్‌లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. మనిషి అపోహలను, మూఢనమ్మకాలు మైక్రోస్కోప్ తుడిచిపెట్టిందని గుర్తు చేశారు. కంటికి కనిపించని పరిమాణంలో ఉన్న జీవుల్ని విజువలైజ్ చేసే పరిజ్ఞానం మైక్రోస్కోప్‌లదని అన్నారు. ప్రపంచంలో ఈ విధంగా అభివృద్ధి సాధించిందంటే మూలకారణం మైక్రోస్కోపేనని తెలిపారు.













