తెలంగాణ గవర్నర్‌గా సత్యపాల్ ?
టాక్ ఆఫ్ ది టూ స్టేట్స్‌గా ఉన్న గవర్నర్ నరసింహన్ మార్పు ఖాయమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సత్యపాల్‌ను కొత్త గవర్నర్‌ను నియమించబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, రాష్ట్ర విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకు నరసింహన్ గవర్నర్‌గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయనను వివాదాస్పద జమ్మూ కశ్మీర్‌కు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేయాలని యోచిస్తోంది. ఐపీఎస్ అధికారి అయిన నరసింహన్‌కు ఇంటెలిజెన్స్ వ్యవహారాలపై బాగా పట్టుంది. ఆయన నేతృత్వంలోని ఆపరేషన్ జమ్మూ కాశ్మీర్, ఆర్టికల్ 35ఏ తదితర విషయాలను చేపట్టి వివిధ అంశాలను ఓ కొలిక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాది కాలంగా జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమించాలనే కేంద్రం యోచనపై తెలంగాణకు చెందిన కొందరు సీనియర్ నేతల్లో విముఖత వ్యవమవుతున్నట్టు సమాచారం. సత్యపాల్ బదులు మరెవరినైనా రాష్ట్ర గవర్నర్‌గా తీసుకోరావాలని హోం మంత్రిత్వ శాఖలోని పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త వ్యక్తి అయితే బెటర్ అని ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టవచ్చని, తమ గ్రిప్‌లో ఉంటారని సదరు నాయకలు భావిస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం.













