రాజ్ భవన్ లో తేనేటి విందు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు దత్తాత్రేయ, సుజనాచౌదరి, తెలంగాణ శాసనసభాపతి, మండలి చైర్మన్ మధుసూదనాచారి, స్వామిగౌడ్, విపక్షనేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు కేశవరావు, డి.శ్రీనివాస్, సీఎస్ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













