గవర్నర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాంకాక్షలు
తెలంగాణ రాష్ట్ర 4వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. గడచిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కాగా, తెలంగాణ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసుకునే దిశగా ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.













