రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ నిబంధనల మేరకు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని గవర్నర్ సూచించారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ కొత్త చరిత్రను సృష్టిస్తోంది అని కొనియాడారు. ప్రభుత్వం, ప్రజల కృషితో కొవిడ్ నుంచి త్వరలోనే బయటపడుతామన్నారు.