తమిళిసై స్థానంలో జార్ఖండ్ గవర్నర్ ఎంట్రీ.. రాష్ట్రపతి భవన్ ఆదేశాలు..

తెలంగాణ గవర్నర్ తమిళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చెన్నై నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేయాలి అన్న ఉద్దేశంతో ఆమె గవర్నర్ గా తన పదవికి రాజీనామా చేసినట్లు టాక్. ఆమె స్థానంలో జార్ఖండ్ గవర్నర్ సి పి రాధాకృష్ణన్ కు తెలంగాణా గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి రాష్ట్రపతి భవన్ నుంచి ఈరోజు ఓ ప్రకటన కూడా వెలువడింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ బాధ్యతలతో పాటు పుదుచ్చేరి బాధ్యతలను కూడా రాధాకృష్ణన్ నిర్వహించాలి అని కోరుతూ ఓ లేఖను విడుదల చేశారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచే నియామకం అమలులోకి వస్తుంది. ఇప్పుడు జార్ఖండ్ గవర్నర్ తెలంగాణ గవర్నర్ గా.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.