గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ప్రముఖ తెలుగు కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆయన రచించిన వల్లంకి తాళం కావ్యానికి ఈ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఢల్లీిలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు సాహిత్య అకాడమీ అధ్యక్షులు చంద్రశేఖర్ కంబరా అవార్డును ప్రదానం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా గౌరారం గ్రామంలో 1965 నవంబరులో జన్మించిన వెంకన్న అనేక సినిమాలకు పాటలు రాడయంతో పాటు ఏకునాదం మోదీ, రేలపూతలు, అలసేంద్ర సంక, పూసిన పున్నమి, వల్లంకి తాళం వంటి కవితా సంపుటాలను రచించారు. అవార్డు అందుకున్న తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కవితా సంపుటిని గుర్తించిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశ్యాప్తంగా 24 భాషల్లోని 24 మంది రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను అవార్డులు అందజేసింది. వీరికి లక్ష రూపాయల నగదుతో పాటు జ్ఞాపికను అందించారు.













