హైదరాబాద్ లో అతిపెద్ద గూగుల్ క్యాంపస్
హైదరాబాద్ మహానగరంలో గూగుల్‌కు చెందిన క్యాంపస్‌ను త్వరలో ఏర్పాటుకానుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పేరున్న అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో కార్పోరేట్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్యాలయం ఏర్పాటు కానుంది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ గూగుల్ క్యాంపస్ త్వరలో గచ్చిబౌలి నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ జిల్లాలో అతి పెద్ద క్యాంపస్ ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాలలో క్యాంపసులు ఉన్నప్పటికీ అమెరికా తరువాత అతి పెద్ద కార్యాలయాన్ని ఇక్కడ నిర్మిస్తోంది.
కాగా దేశంలో అతి పెద్దగా, అన్ని సౌకర్యాలతో నిర్మాణం చేస్తున్నారు. నానక్‌రాంగుడాలో నిర్మించనున్న ఈ క్యాంపస్ నిర్మాణం కోసం సుమారు రూ.1000 కోట్లను వెచ్చిస్తున్నట్లు తెలిసింది. 13 వేల మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా దీని నిర్మాణం సాగనుంది. ఒకే బ్లాక్‌గా దీని నిర్మాణం సాగుతుండగా, మొత్తం 22 ఫ్లోర్లతో దీన్ని నిర్మిస్తున్నారు. మూడు బేస్మెంట్లు, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొత్తం 22 అంతస్తుల్లో నిర్మాణం చేస్తున్నట్లు సమాచారం. మూడు బేస్మెంట్లను పార్కింగ్కోసమే వినియోగించనున్నారు. పూర్తిగా సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో మొత్తం కార్యాలయానికి 300 కిలోవాట్ల విద్యుత్ అవసరం ఉందని తేలింది. ఇప్పటికే హైదరాబాద్ గూగుల్‌కు ఒక క్యాంపస్ ఉంది.













